క్రికెట్ ఫ్యాన్స్‌కు బంఫర్ ఆఫర్.. టీ20 వరల్డ్ కప్‌ మ్యాచ్‌లు ఉచితం.. ఎక్కడో తెలుసా?

by Harish |
క్రికెట్ ఫ్యాన్స్‌కు బంఫర్ ఆఫర్.. టీ20 వరల్డ్ కప్‌ మ్యాచ్‌లు ఉచితం.. ఎక్కడో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ అయిపోయిన వెంటనే టీ20 వరల్డ్ కప్‌ సందడి మొదలుకానుంది. జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీకి వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. పొట్టి ప్రపంచకప్ కోసం ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ గుడ్ న్యూస్ చెప్పింది.

టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను ఉచితంగా చూడొచ్చని తెలిపింది. మొబైల్ వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. మొబైల్ యూజర్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్‌లో మ్యాచ్‌లను ఉచితంగా చూడొచ్చు. ప్రేక్షకులకు క్రికెట్‌ను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు డిస్నీ ప్లస్ హాట్‌‌ స్టార్ ఇండియా హెడ్ సాజిత్ శివానందన్ తెలిపారు.

హాట్ స్టార్‌లో క్రికెట్ మ్యాచ్‌లు ఉచితంగా స్ట్రీమింగ్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లను కూడా ఉచితంగా ప్రసారం చేసింది. దీనిద్వారా సబ్‌స్కైబర్లు పెరగడంతోపాటు రికార్డు స్థాయిలో వ్యూయర్‌షిప్ వచ్చింది. దీంతో ప్రకటనల ద్వారా భారీగా ఆదాయం ఆర్జించే అవకాశం ఉంటుంది. ఐసీసీ అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌ చానెల్‌లో కూడా వరల్డ్ కప్‌ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.

Advertisement

Next Story