- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య
దిశ,దుబ్బాక : చేసిన అప్పులు తీర్చలేక, ఆర్థిక ఇబ్బందులతో జీవితం మీద విరక్తి చెందిన యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన దుబ్బాక పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. దుబ్బాక ఎస్సై వి.గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం దుబ్బాక రెండు పడక గదుల గృహ సముదాయంలో తుమ్మ రాజలింగం అనే వ్యక్తి బీడీ ప్యాకింగ్ చేస్తూ భార్య, కుమారుడు తుమ్మ నవీన్ (25)తో జీవనం కొనసాగిస్తున్నాడు. కుమారుడు నవీన్ కు నాలుగు సంవత్సరాల క్రితం ఒక అమ్మాయితో వివాహం జరిగింది. అనంతరం నవీన్ కొంతకాలం వివిధ పనులు చేసినప్పటికీ సరైన ఆదాయం లభించలేదు.
సరైన ఉపాధి లేకపోవడంతో అప్పులు చేశాడు. దాంతో ఒకవైపు చేసిన అప్పులు తీర్చలేక, మరోవైపు పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందులతో తీవ్రంగా బాధపడేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసిన అనంతరం తన గదిలోకి వెళ్లి జీవితం మీద విరక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు ఎంత పిలిచినా గది తలుపులు తీయకపోవడంతో, స్థానికుల సహాయంతో గది తలుపులను తెరవగా ఉరి వేసుకుని మృతి చెంది కనిపించాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, అక్కడికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం దుబ్బాక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మృతుని తండ్రి రాజలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
- Tags
- suicide