అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

by Anjali |   ( Updated:2024-09-15 08:35:12.0  )
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
X

దిశ, మిర్యాలగూడ: ఉరివేసుకొని అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మృతి చెందిన సంఘటన దామరచర్ల మండలం పుట్టలగడ్డ లో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాన్ తండాకు చెందిన భూక్య మౌనిక (20) పుట్టల గడ్డకు చెందిన నాగు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా శనివారం మౌనిక పుట్టల గడ్డకు వెళ్లి, నాగును పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. దీంతో ఇరువురు మధ్య చిన్నపాటి గొడవ జరిగినట్లు స్థానికులు తెలిపారు. కాగా ఆదివారం తెల్లవారేసరికి యువతి చెట్టుకు ఉరేసుకొని మృతి చెందింది. దీంతో నాగు హత్య చేసి ఉరివేసి ఉంటాడని యువతి బంధువులు ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నాగుపై అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story