గంజాయి విక్రయించే మహిళ అరెస్ట్

by Sridhar Babu |
గంజాయి విక్రయించే మహిళ అరెస్ట్
X

దిశ, వరంగల్ : వరంగల్ లోని మండి బజార్ మద్రాసి దర్గా ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న షేక్ రషీదా బేగం అనే మహిళను బుధవారం ఉదయం ఇంతేజార్ గంజ్ పోలీసులు అరెస్టు చేశారు. కాజీపేట ప్రాంతానికి చెందిన షేక్ రషీదా బేగం భర్త వికలాంగుడు. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. దాంతో వీరు మండి బజార్ లో నివాసం ఉంటూ మద్రాసి మసీదు వద్ద భిక్షాటన చేస్తూ తమ కుటుంబాన్ని పోషించుకునేవారని, అలా వచ్చే డబ్బులు తమ అవసరాలకి, కుటుంబ పోషణకి సరిపోవట్లేదని, దానివల్ల అప్పులు చేయడంతో ఇంట్లో గొడవలు అవుతున్నాయని పోలీసులు తెలిపారు. ఎలాగైనా సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో బల్లర్ష నుండి గంజాయిని తీసుకొచ్చి అమ్మితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని నిందితురాలు గత 15 రోజుల క్రితం బల్లర్ష వెళ్లి అక్కడ ఖలీమ్ అనే వ్యక్తి దగ్గర అరకిలో గంజాయి మూడు వేల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసింది.

ఆ గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి మద్రాసి మసీదు వద్ద అమ్ముతూ డబ్బులు సంపాదిస్తుంది. అయితే ఈరోజు ఉదయం గ్రీన్ కలర్ సంచిలో గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్న సమయంలో అటుగా పెట్రోలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి భయంతో పారిపోవాలని ప్రయత్నిస్తుండగా పట్టుకున్నారు. ఆమెను తనిఖీ చేయగా సంచిలో గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దాంతో ఇంతేజర్ గంజ్ స్టేషన్ కు తీసుకువచ్చి కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపారు. అలాగే నిందితురాలు నుండి సుమారు 6250 విలువగల 250 గ్రాముల గంజాయి, 3050 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ మాట్లాడుతూ ఎవరైనా గంజాయి అమ్మినా, అక్రమ రవాణా చేసినా, తాగినా వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed