- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రైల్వే ట్రాక్ పై గుర్తుతెలియని మృతదేహం
దిశ, యాదాద్రి కలెక్టరేట్ : భువనగిరి - పగిడిపల్లి రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మృతదేహం గురువారం లభ్యమైంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి 10:30 గంటలకు భువనగిరి రైల్వే స్టేషన్ నుండి పగిడిపల్లి రైల్వే స్టేషన్ మధ్యలో ఎగువలైన్ దిగువ లైన్ మధ్యలో మెయిన్ లైను ట్రాక్ పైన ఒక గుర్తు తెలియని మగమనిషి మృతదేహం ఉన్నట్లుగా ట్రాక్ పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించారు.
వెంటనే భువనగిరి రైల్వేస్టేషన్ మాస్టర్ ద్వారా రైల్వే పోలీసులు సమాచారం అందుకున్నారు. మృతుడు గుర్తుతెలియని మగమనిషి వయసు సుమారు 40 నుండి 45 సంవత్సరాలు ఉంటాయి. గుర్తుతెలియని రైలు బండి కింద పడి చనిపోయి ఉన్నాడు. మృతదేహాన్ని భువనగిరి ఆస్పత్రి మార్చురిలో భద్రపరిచారు. మృతుని శరీరంపై లేత ఆకుపచ్చ టీ షర్టు, ఆకుపచ్చ నైట్ ప్యాంటు, బ్లాక్ షూ ఉన్నాయి. ఆచూకీ తెలిసినవారు భువనగిరి రైల్వే పోలీస్ ఇన్చార్జి, రైల్వే హెడ్ కానిస్టేబుల్ కృష్ణారావు ఫోన్ నెంబర్ 9848222169,8712568454 లకు సమాచారం ఇవ్వాలని కోరారు.