భర్త వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య

by Sridhar Babu |
భర్త వేధింపులు భరించలేక  పురుగుల మందు తాగి ఆత్మహత్య
X

దిశ, అబ్దుల్లాపూర్మెట్ : కొద్దిరోజులుగా భర్త వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం అబ్దుల్లాపూర్మెట్ మండలం అనాజ్ పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఇబ్రహీంపట్నం మండలం మాన్యకొండ గ్రామానికి చెందిన నార్లగొండ పారిజాత (32) కు అబ్దుల్లాపూర్మెట్ మండలం అనాజ్ పూర్ గ్రామానికి చెందిన నార్లకొండ మహేందర్ తో 2010 సంవత్సరంలో వివాహం అయింది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. నార్లగుండ మహేందర్ పాల వ్యాపారం చేస్తూ గత రెండు సంవత్సరాల క్రితం నుంచి నిత్యం తాగి వస్తూ భార్యను శారీరకంగా మానసికంగా వేధించేవాడు. అదేవిధంగా నిత్యం కొడుతూ ఉండడంతో ప్రజల సమక్షంలో పంచాయితీ పెట్టి సర్ది చెప్పుకున్నారు.

అయినప్పటికీ మహేందర్ మారకుండా భార్యను హింసిస్తుండటంతో శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి అపస్మారకస్థితిలోకి వెళ్లింది. ఈ విషయం పారిజాత అన్న సురేష్ కి ఫోన్లో తెలిపి తాము ఆసుపత్రికి వెళ్తున్నామని వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా ఆసుపత్రికి బంధువులు, కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా పారిజాత చనిపోయి ఉండి. నోరు, ముక్కులో నుండి నురగ కారుతూ, ముఖం మరియు కడుపు ఉబ్బి ఉన్నదని, భర్త పెట్టే వేధింపులు భరించలేకనే పారిజాత పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నదని మృతురాలు అన్న గునుకుల సురేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు వివరించారు.

Advertisement

Next Story

Most Viewed