వరదల్లో చిక్కుకుని ఇద్దరు బలి

by Sridhar Babu |
వరదల్లో చిక్కుకుని ఇద్దరు బలి
X

దిశ, మాచారెడ్డి : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పోటెత్తిన వరదల్లో చిక్కుకొని కామారెడ్డి జిల్లా ఉమ్మడి మాచారెడ్డి మండలంలో ఇద్దరు బలయ్యారు. లచ్చ పేట గ్రామానికి చెందిన మత్స్య కార్మికుడు శివరాములు(55) చేపల వేటకు వెళ్లి పోటెత్తిన వరదల్లో చిక్కుకొని ఆచూకీ లేకుండా పోయాడు. రెండు రోజులుగా అతని కోసం గాలిస్తున్నా లభించలేదు. పాల్వంచ మండలం మంథని దేవునిపల్లి గ్రామానికి చెందిన కోమటి పెద్ద నరసయ్య (60) అనే వృద్ధుడు బీబీపేట మండలం మాందాపూర్ లో గల తన కూతురి ఇంటికి వెళుతూ ఎడ్లకట్ట వాగు ప్రవాహంలో చిక్కుకొని మృతి చెందాడు. మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వరదలకు బలి కావడం విషాదాన్ని నింపింది.

Advertisement

Next Story

Most Viewed