పడవ బోల్తా పడి ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురి మృతి: అసోంలో విషాదం

by samatah |
పడవ బోల్తా పడి ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురి మృతి: అసోంలో విషాదం
X

దిశ, నేషనల్ బ్యూరో: అసోంలో ఆకస్మికంగా సంభవించిన తుపాను బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షం, తుపాను కారణంగా బ్రహ్మపుత్ర నదిలో ఓ పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మరణించారు. మహిళలు, పిల్లలతో కూడిన పడవ కాళీ ఆల్గా ఘాట్ నుండి నేపూర్ అల్గా చరాంచల్‌కు వెళ్తుండగా.. సౌత్-సల్మారా మంకాచార్ జిల్లా వద్ద ప్రమాదం చోటు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో బ్రహ్మపుత్రానది అల్లకల్లోలం అవడమే ఈ ప్రమాదానికి కారణమని వెల్లడించారు. ఘటన విషయం తెలిసిన వెంటనే స్థానిక మత్య్స కారులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి.. 20మందిని రక్షించారు. మరోవైపు గువహటిలోని గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. విమానాశ్రయం పైకప్పులో కొంత భాగం కూలిపోలిపోగా..కొద్దిసేపు విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఆరు విమానాలను దారి మళ్లించినట్టు తెలుస్తోంది. ఈ వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని భారత్ వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అసోంకు ఆరెంజ్ ఆలర్ట్ జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed