- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తాళం వేసి ఊరికి వెళ్లిన ఇంట్లో దొంగల బీభత్సం..
దిశ, నేరేడుచర్ల : తాళం వేసి ఊరికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి దొంగలు తలుపు బెడం ఇరగకొట్టి ఇంట్లోకి ప్రవేశించి ఇంటిలోపల గల బీరువాను పగలగొట్టి అందులోని నగదు, ఆభరణాలను దొంగలించుకుని వెళ్ళిన సంఘటన ఆదివారం నేరేడుచర్ల పట్టణంలో చోటు చేసుకుంది. నేరేడుచర్ల ఎస్సై రవీందర్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం మున్సిపాలిటీ పరిధిలోని పాత నేరేడుచర్లలో నివాసం ఉంటున్న నూకల జానకమ్మ ఈనెల 10న శనివారం మధ్యాహ్నం ఇంటి బయట గేటుకు తాళం వేసి పెన్ పహాడ్ మండలంలోని నారాయణ గూడెం గ్రామంలో నివాసం ఉంటున్న వాళ్ల అక్క ఇంటికి వెళ్లింది.
తిరిగి ఆదివారం ఇంటికి వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తులు గోడదూకి, లోపలికి వెళ్లి ఇంటికి తాళం వేసిన బేడెం కోసి తలుపులు తెరిచి లోనికి వెళ్లి బీరువా పగలగొట్టి అందులో ఉన్న రూ. 50 వేల నగదు, 8 తులాల వెండి, రెండు తులాల బంగారు ఆభరణాలు తీసుకెళ్లినట్లు గుర్తించి మాకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించడంతో పాటు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్ల ఎస్సై తెలిపారు.