దొంగల హల్‌చల్..బైక్ మెకానిక్ షాప్‌లో దొంగతనం

by Aamani |
దొంగల హల్‌చల్..బైక్ మెకానిక్ షాప్‌లో దొంగతనం
X

దిశ,వెబ్ డెస్క్ : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో దొంగలు హల్చల్ సృష్టిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం బట్టల షాపులో బట్టల దొంగతనం,కిరాణం షాపులో సిగరెట్ల దొంగతనం,ఇప్పుడు డబ్బులు బంగారం దొంగతనాలు,చేసుకుంటూ దొంగలు ప్రజలను బెంబేలేత్తిస్తున్నారు.మహబూబాబాద్ జిల్లా,తొర్రూరు పట్టణ కేంద్రంలోని విగ్నేశ్వర బైక్ మెకానిక్ షాప్ లో సుమారుగా 2 లక్షలు నగదు,రెండు తులాల బంగారం,20 తులాల వెండి,దొంగలు చోరీకి పాల్పడినట్లు బాధితులు గోనే మహేష్ భార్య దివ్య బోరున విలపించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... గోనె మహేష్ 11 సంవత్సరాలుగా తొర్రూరు పట్టణంలోని ఆంధ్రాబ్యాంక్ సమీపంలో విఘ్నేశ్వర బైక్ మెకానిక్ కిరాయికి నడుపుతున్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణపతి నిమజ్జనం కొరకు స్వగ్రామమైన తొర్రూరు మండలం,కంటయపాలెం గ్రామానికి 15-09-2024,అనగా ఆదివారం రోజున గణేష్ నిమజ్జనానికి వెళ్లారు.

మరల సోమవారం రోజున తిరిగి వచ్చారు.అదే రోజున సాయంత్రం మరల కంటాయపాలెం గ్రామానికి చేరుకొని,మరల,మంగళవారం రోజున రోడ్డుపై నుంచి తన షాపును చూసుకుంటూ వెళ్లిపోయారు.అదేవిధంగా బుధవారం రోజున ఉదయం 8.30 నిమిషాలకు తన షాపు వద్దకు చేరుకొని, షట్టర్, తలుపులు తీయగా వెనుకవైపు ఉన్న తలుపు తాళాలు వేయకుండా ఉండడం తో,అనుమానంతో బీరువాను చూడగా బీరువా ఓపెన్ చేసి ఉండడంతో అందులో నుండి సుమారుగా రెండు లక్షల రూపాయలు,రెండు తులాల బంగారం,20 తులాల వెండి దొంగలించారు. వెంటనే బాధితుడు మహేష్ తన భార్య దివ్య పోలీసులను ఆశ్రయించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఫింగర్ ప్రింట్ దొరికాయి : జి.ఉపేందర్ ఎస్సై తొర్రూర్

గోనె మహేష్ భార్య దివ్య గత 11 సంవత్సరాలుగా విగ్నేశ్వర బైక్ మెకానిక్ షాప్ ను కిరాయికి తీసుకొని నడిపిస్తున్నారు. అయితే గణేష్ నిమజ్జనానికి కుటుంబ సభ్యులతో తన స్వగ్రామమైన కంటయపాలెం కు వెళ్లి తిరిగి బుధవారం ఉదయం 8.30 ఇంటికి చేరుకోగా ఇంటి వెనుక వైపు ఉన్న తలుపులు ఓపెన్ చేసి ఉండడంతో బీరువాలో చూడగా 2 లక్షలు నగదు,2 తులాల బంగారం,20 తులాల వెండి,చోరికి పాల్పడినట్లు బాధితుడు మహేష్ పిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.అదేవిధంగా బ్లూ స్టీమ్ మరియు డాగ్స్ ప్యాడ్ తీసుకువచ్చి వివరాలు సేకరించాం. వివరాలలో ఫింగర్ ప్రింట్ దొరికాయి త్వరలోనే దొంగను పట్టుకుంటాము.

Advertisement

Next Story

Most Viewed