- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం..20 గంటల్లో ఛేదించిన పోలీసులు
దిశ, మెట్ పల్లి: జగిత్యాల జిల్లా మెట్ పల్లి పోలీసులు రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును 20 గంటల్లో ఛేదించారు. బుధవారం మెట్ పల్లి కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిడ్నాప్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మెట్ పల్లి పట్టణ కేంద్రంలోని దుబ్బవాడలో నివసిస్తున్న లక్ష్మి,రాజులకు రెండు సంవత్సరాల కుమారుడు శివను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్నప్పటి నుండి కిడ్నాప్ కు గురైన బాలుడు కోసం 6 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరా లను పరిశీలించి టెక్నాలజీ తో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు.
కాగా ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట గ్రామానికి చెందిన ఇస్లావత్ నగేష్ అనే నిందితుడిని నిర్ధారణకు వచ్చిన పోలీసులు యువకుడు మెట్ పల్లి పట్టణంలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. యువకుడు జల్సాల కోసం అలవాటు పడి బాలుడిని కిడ్నాప్ చేసి రూ.1 లక్ష 50 వేలకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకొని ఈ కిడ్నాప్ కు పాల్పడ్డట్లు తమ విచారణలో నిందితుడు వెల్లడించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
6 ప్రత్యేక పోలీసు బృందాలు...
ఈ కిడ్నాప్ కేసుని చెందించేందుకు మెట్ పల్లి డివిజన్ పోలీసులు 6 బృందాలుగా ఏర్పడి సీసీ ఫుటేజ్ లని పరిశీలిస్తూ నిందితుని ఆచూకీ కోసం వెతికి పట్టుకున్నట్లు చెప్పారు. ఆచూకీలభ్యమైన బాలుని కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. మెట్ పల్లి డీఎస్పీ ఉమ మహేశ్వర్ రావ్ నేతృత్వంలో ఆరు పోలీస్ బృందాలుగా ఏర్పడి కిడ్నాప్ కేసు ఛేదించినట్లు ఎస్పీ తెలిపారు.ఈ సమావేశంలో మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి, కోరుట్ల సీఐ సురేష్, సీసీఎస్ సీఐ లక్ష్మి నారాయణ, మెట్ పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లపూర్ ఎస్ఐలు చిరంజీవి, అనిల్, కిరణ్ కుమార్, రాజు, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.