- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చాక్లెట్ పరిశ్రమలో అనుమానాస్పదంగా కార్మికుడు మృతి
దిశ,హత్నూర : హత్నూర మండల పరిధిలోని లోటస్ చాక్లెట్ పరిశ్రమలో ఓ కార్మికుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ సంఘటన హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి. హత్నూర మండల పరిధిలోని నస్తీపూర్ గ్రామ శివారులో ఉన్న లోటస్ చాక్లెట్ పరిశ్రమలో మంగాపూర్ గ్రామానికి చెందిన సత్యనారాయణ (44) విధులు నిర్వహిస్తున్నాడు. 15 సంవత్సరాల నుండి అదే పరిశ్రమలో మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగా బుధవారం జనరల్ షిఫ్ట్ లో పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు.
అప్పటికే పరిశ్రమ యాజమాన్యం గుట్టు చప్పుడు చేయకుండా ఆసుపత్రికి తరలించారని గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపారు. దీంతో స్థానికులు, కుటుంబీకులు కలిసి సత్యనారాయణ మృతదేహాన్ని పరిశ్రమ ముందు ఉంచి ధర్నా నిర్వహించారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని పరిశ్రమ ముందు నినాదాలు చేశారు. పరిశ్రమ యజమాన్యం నిర్లక్ష్యం వల్ల సత్యనారాయణ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. సంఘటన స్థలానికి జిన్నారం సీఐ సుధీర్ కుమార్, హత్నూర ఎస్ఐ సుభాష్ లు కలిసి చేరుకొని బాధితులకు నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. సత్యనారాయణ కుటుంబంలో ఒక ఉద్యోగం తో పాటు 8 లక్షలను పరిశ్రమ యజమాన్యం నష్టపరిహారం చెల్లించింది.