crime news : తల్లిని హతమార్చిన తనయుడు..

by Sumithra |
crime news : తల్లిని హతమార్చిన తనయుడు..
X

దిశ, నిజాంపేట : మద్యానికి బానిసై కన్న కొడుకే తల్లిని హత్య చేసిన సంఘటన నిజాంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. సీఐ వెంకట రాజా గౌడ్, ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన సల్మేటి దుర్గవ్వ (75)ను తన కుమారుడు రామచంద్రం హత్య చేశాడు. మద్యానికి బానిసై రామచంద్రం తన తల్లిని పెన్షన్ డబ్బులు అడగగా ఇవ్వలేదని గురువారం అర్ధరాత్రి చున్నీతో ఉరివేసి హత్య చేసినట్లు నిర్ధారించారు. మృతురాలి కుమార్తె నాగుల విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

Advertisement

Next Story