Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

by Aamani |
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
X

దిశ,జహీరాబాద్: జహీరాబాద్ -బీదర్ రోడ్డుపై న్యాల్కల్ మండలం హద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారును ట్రక్కు ఢీట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటనలో కర్ణాటక బీదర్ పట్టణానికి చెందిన షాహిరా బేగం 45, కారు డ్రైవర్ ఎండి.సిరాజుద్దీన్ లు మృతి చెందగా, షేక్ అమాన్ తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్ నుంచి బీదర్ వైపు వస్తున్న టవేరా కారును ఎదురుగా వస్తున్న ట్రక్కు హుసెల్లి గ్రామ శివారులో బలంగా ఢీ కొట్టింది. దీంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో షాహిరా బేగం, కారు డ్రైవర్ ఎండి.సిరాజుద్దీన్, షేక్ అమాన్ లు తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిని వెంటనే బీదర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానిక వైద్యులు క్షతగాత్రులను పరీక్షించి షాహిరా బేగం, కారు డ్రైవర్ ఎండి.సిరాజుద్దీన్ ఇదివరకే మృతి చెందినట్లు స్పష్టం చేశారు. మృతురాలి సోదరుడు షేక్ ముఖిమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హద్నూర్ పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Next Story