- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అర్హత లేకున్నా వైద్యుడిగా చెలామణి
దిశ, లింగాలఘణపురం : ఎలాంటి అర్హతలు లేకుండా క్లినిక్ నిర్వహిస్తూ, అల్లోపతి మందులు అమ్ముతూ, వైద్యుడిగా కొనసాగుతున్న వ్యక్తిపై ఔషధ నియంత్రణ శాఖ అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేసి మందులను సీజ్ చేశారు. ఈ సంఘటన మండలంలోని నవాబుపేట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. జిల్లా ఔషధ తనిఖీ అధికారి ఏలే బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం ఔషధ నియంత్రణ శాఖ డాక్టర్ రాజ్యలక్ష్మి పర్యవేక్షణలో, వరంగల్ జిల్లా ఔషధ తనిఖీ అధికారి అరవింద్ కుమార్ తో సంయుక్తంగా నవాబుపేట గ్రామంలో దాడులు నిర్వహించగా గ్రామానికి చెందిన అలికట్టి కృష్ణ కు ఎలాంటి అర్హతలు లేకున్నా వైద్యుడిగా మృధుల క్లినిక్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అదే విధంగా ఎలాంటి అనుమతులు లేకుండా అల్లోపతి మందులు అమ్ముతున్నాడని, అమ్మడానికి క్లినిక్ లో సిద్ధంగా పెట్టుకున్న 56 రకాల మందులను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్టు తెలిపారు. సదరు అర్హత లేని వైద్యుని పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. జప్తు చేసిన మందుల విలువ 25 వేల రూపాయలు ఉంటుందన్నారు. ఈ మందులను జనగామ జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో అప్పగించినట్లు తెలిపారు. దాడుల్లో నవాబుపేట హెల్త్ సబ్ సెంటర్ కు చెందిన ఆర్. గాయత్రి, నల్ల ఇందిర పాల్గొన్నారు.
- Tags
- fake doctor