- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Cyber crime : ఆన్లైన్ మోసం నుండి అప్రమత్తమైన వృద్దుడు..
దిశ, ఎల్లారెడ్డి : సైబర్ మోసగాడి చేతిలో నుంచి ఓ తండ్రి అప్రమత్తమైన సంఘటన ఎల్లారెడ్డి మండలంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డి మండలంలోని మాచాపూర్ గ్రామానికి చెందిన బల్లి వెంకటేశం అనే వ్యక్తికి పోలీసు యూనిఫాంలో ఉన్న ఒక అపరిచిత వ్యక్తి శనివారం ఉదయం ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు.
తన కొడుకును అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న భయంతో ఆందోళన చెందిన తండ్రి అపరిచితుని మాటలు నమ్మి ఆన్లైన్లో డబ్బులు కొట్టడానికి సిద్ధమయ్యాడు. సరిగ్గా అదే సమయానికి అనుకోకుండా ఆన్లైన్ సర్వర్ ప్రాబ్లం రావడంతో డబ్బులు పోకపోవడం, అదే సమయంలో వెంకటేశం తన కొడుకుకు ఒకసారి ఫోన్ చేయడం, తన కొడుకు రూమ్ లోనే పడుకున్నారని చెప్పడంతో ఈ సైబర్ మోసం అని గ్రహించిన వెంకటేశం వెంటనే అతనికి కాల్ చేసి గట్టిగా గర్జించాడు. దాంతో సైబర్ మోసం నుంచి తాను బయటపడ్డానని వెంకటేశం ఊపిరి పీల్చుకున్నాడు.