బాలీవుడ్ ఇండస్ట్రీపై నాగవంశీ సెటైర్లు.. బోనీ కపూర్ రియాక్షన్ ఇదే (వీడియో)

by Hamsa |
బాలీవుడ్ ఇండస్ట్రీపై నాగవంశీ సెటైర్లు.. బోనీ కపూర్ రియాక్షన్ ఇదే (వీడియో)
X

దిశ, సినిమా: 2024 చివరకు చేసుకోవడంతో సినీ ఇండస్ట్రీ పరిస్థితిని చర్చించడానికి పలువురు డైరెక్టర్స్, నిర్మాతలు రౌండ్ టేబుల్ చిట్ చాట్ నిర్వహించారు. ఇందులో టాలీవుడ్ నిర్మాత నాగవంశీ(Naga Vamsi), బాలీవుడ్ డైరెక్టర్ బోనీ కపూర్(Boney Kapoor) ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకున్నారు. బోనీ కపూర్ మాట్లాడుతూ.. ‘‘తెలుగు సినిమాలకి యూస్ లో మంచి మార్కెట్ ఉంది. తమిళ చిత్రాలకు సింగపూర్(Singapore), మలేషియాలలో మార్కెట్ ఉంది’’ అని అన్నారు. ఈ క్రమంలో నాగవంశీ మధ్యలో కలుగజేసుకుంటూ ‘‘మీరు ఒక్క విషయాన్ని అంగీకరించాలి.

ఇది కొంచెం హార్ష్‌గా ఉన్నా ఇది మీరు ఒప్పుకొని తీరాలి. మా సౌత్ ఇండియన్స్ బాలీవుడ్ వాళ్లు సినిమాలు చూసే విధానాన్ని కూడా పూర్తిగా మార్చేసాం. ఎందుకంటే మీరు ఇంకా బాంద్రా, జుహు దగ్గరే స్టక్ అయిపోయారు. కానీ మేము బాహుబలి(Baahubali), RRR, పుష్ప, కల్కి, యానిమల్(Animal) వంటి సినిమాలు తీశాం’’ అని అన్నారు. ఇక దానికి బోనీ కపూర్.. ‘ఇవి మేము ఎప్పుడో చేసామని బదులిచ్చారు. దీంతో వెంటనే నాగవంశీ ‘‘మీరు ఇంతకముందు ‘మొఘల్ ఏ ఆజమ్’ మూవీ తర్వాత తెలుగు సినిమాలైన బాహుబలి, RRR లను ప్రస్తావించారు.

ఒక్క హిందీ మూవీ పేరు కూడా చెప్పలేదు. గత 3-4 ఏళ్లలో మాస్ చిత్రాలు, ఈవెంట్ ఫిలింస్ తో ఇండియన్ సినిమాని మేము రీడిస్కవర్ చేశాం. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, సలార్, యానిమల్.. ఇవన్నీ సౌత్ నుంచి వచ్చి హిందీలో భారీ కలెక్షన్స్ రాబట్టాయి’’ అని నాగవంశీ చెప్పుకొచ్చారు. దీంతో గదర్-2, పఠాన్, జవాన్ వంటి హిందీ సినిమాలను మర్చిపోయావ్ అని బోనీ కపూర్ అనగా.. 'జవాన్' మా సౌత్ డైరెక్టర్ తీసిన సినిమానే అని వంశీ మళ్ళీ కౌంటర్ వేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed