పరకామణిలో చోరీపై మళ్లీ విచారించాలి.. బీజేపీ నేత డిమాండ్

by Jakkula Mamatha |
పరకామణిలో చోరీపై మళ్లీ విచారించాలి.. బీజేపీ నేత డిమాండ్
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమలలో పరకామణి కుంభకోణం పై మరోసారి రచ్చ రేపుతుంది. పెద్ద జీయర్ మఠం ఉద్యోగి సీవీ.రవికుమార్ పరకామణి నుంచి కోట్ల రూపాయల విదేశీ కరెన్సీ తరలించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టబడగా.. అతనిపై కేవలం రూ.78 వేల విలువైన డాలర్లు దొరికాయని పోలీసులు కేసు నమోదు చేయడం అనంతరం విచారణాధికారి అతనితో లోక్ అదాలత్‌లో రాజీ పడటాన్ని మరోసారి చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో తిరుమల(Tirumala) పరకామణి లో జరిగిన చోరీపై పునర్ విచారణ జరగాలని BJP నేత, TTD పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్(Bhanu Prakash) డిమాండ్ చేశారు. గతంలో ధార్మిక క్షేత్రంలో అన్నీ దాపరికాలే అని విమర్శించారు. దొంగలను ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. స్వామి ఖజానాను కొల్లగొట్టిన వారిని వదలబోమని హెచ్చరించారు. చోరీకి సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలతో CMను కలుస్తామన్నారు. TTDలో ఇంకా రెండు మూడు అక్రమాలు జరిగాయని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed