- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిజం.. నిర్భయం 'దిశ ' నైజం
దిశ, హుజురాబాద్ : నిజాన్ని నిర్భయంగా రాయడంలో దిశ పత్రిక ముందుందని, ఎప్పటి వార్తలు అప్పుడే అందించడంతో పాటుగా కాలంతో పాటు మారుతూ పాఠకుల అభిమానాన్ని చూరగొన్న దిశకు ప్రత్యేక అభినందనలు అని హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ అన్నారు. హుజురాబాద్ లో శుక్రవారం దిశ క్యాలండర్ ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠకులు నేటి పరిస్థితుల్లో కాలానికి విలువ ఇస్తున్నారని, ఎప్పటి వార్తలు అప్పుడే కోరుకుంటున్నారని, అందుకు అనుగుణంగా దిశ పత్రిక సరికొత్త హంగులు, ఫీచర్స్ తో దూసుకు పోతూ ప్రధాన పత్రికలకు అనతి కాలంలో దీటుగా తయారవ్వటం అభినందనీయం అని అన్నారు.
దిశలో పనిచేస్తున్న విలేకరులు, సిబ్బంది, యాజమాన్యం సైతం పాఠకులకు అనుగుణంగా తయారవ్వటం చూస్తుంటే రానున్న కాలంలో దిశ మరింత కొత్తగా మారడం ఖాయం అనిపిస్తుందని అన్నారు. దిశ పత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ గుర్రం తిరుమల్, రూరల్ సీఐ పులి వెంకట్, దిశ అర్సీ ఇన్చార్జి మామిడి రవీందర్ గౌడ్, రూరల్ రిపోర్టర్ కాయిత రాములు, జమ్మికుంట రిపోర్టర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.