‘ఆ విషయం పై సీఎం చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారు’.. మంత్రి అనగాని కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
‘ఆ విషయం పై సీఎం చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారు’.. మంత్రి అనగాని కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధప్రదేశ్‌లో నిర్వహించిన రెవెన్యూ సదస్సు(Revenue conference)ల్లో అర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తిగా లేరని మంత్రి అనగాని సత్యప్రసాద్(minister Anagani Satyaprasad) వెల్లడించారు. ఈ క్రమంలో నేడు(శుక్రవారం) మంగళగిరి CCLA ఆఫీస్‌లో రెవెన్యూ శాఖపై మంత్రి అనగాని సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో 12 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. 2016లో అసెంబ్లీలో తాను ప్రస్తావించిన 22 ఏ సమస్యకే ఇంకా పరిష్కారం చూపలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) కూడా సీరియస్‌గా ఉన్నారని, ప్రజలు ఎంతమేరకు సంతృప్తిగా ఉన్నారనే విషయంపై అధికారులు ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని సూచించారు. ప్రజల అర్జీలను పరిష్కరించడంలో అలసత్వంగా పని చేయడం మానుకోవాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ హితవుపలికారు.

Advertisement

Next Story