భార్యను బండరాయితో కొట్టి చంపిన భర్త

by Sridhar Babu |
భార్యను బండరాయితో కొట్టి చంపిన భర్త
X

దిశ, మేడిపల్లి : మేడిపల్లి మండలంలో అమానుషం జరిగింది. భార్య, భర్తల మధ్య చిన్నపాటి గొడవ క్షణికావేశంలో హత్యకు దారితీసింది. భార్యను భర్త బండరాయితో కొట్టి హత్య చేసిన సంఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధి ప్రతాపసింగారం గ్రామంలో కలకలం సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ కు చెందిన నిహారిక (35) కు ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం కాకరై గ్రామానికి చెందిన శ్రీకర్ రెడ్డి తో 2017 లో వివాహం జరిగింది.

వీరికి ఐదు సంవత్సరాల బాలుడు, మూడు సంవత్సరాల కూతురు ఉన్నారు. నిహారికకు తల్లిదండ్రులు ప్రతాప సింగారం గ్రామంలో ఒక ఇల్లు కొనిచ్చారు. ఆ ఇల్లు విషయంలో అది తన పుట్టింటి వాళ్లు ఇచ్చిన ఇల్లు అని నిహారిక నిత్యం అనేది. ఈ విషయంలో భార్య, భర్త మధ్య ఘర్షణ జరిగేది. ఇదే విషయంలో గత రాత్రి కూడా ఘర్షణ జరగడంతో భార్యను శ్రీకర్ రెడ్డి బండ రాయితో కొట్టి హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed