mla Tellam Venkata Rao : కేటీఆర్ ది పైశాచిక ఆనందం

by Sridhar Babu |
mla Tellam Venkata Rao : కేటీఆర్ ది పైశాచిక ఆనందం
X

దిశ, భద్రాచలం : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి నైతిక విలువలు లేవని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయించుకొని పైశాచిక ఆనందం పొందుతున్నాడని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ లోకి వెళ్లడం అంటే ఆత్మహత్య చేసుకోవడమే ఆని పేర్కొన్నారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాలపై ఆయన పై విధంగా స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయం కాదని, సహచర శాసనసభ్యులు పలకరించారు కదా అనే సదుద్దేశంతో స్నేహపూర్వకంగా

మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నట్లు దొంగ చాటున తీసిన ఫొటోను అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేసుకోవడం ఆ పార్టీ విధానాలకు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నైతిక విలువకు నిదర్శనం అని మండి పడ్డారు. భద్రాచలం ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, భద్రాచలం అభివృద్ధే అంతిమంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని, బీఆర్ఎస్ పార్టీ వాళ్లు సోషల్ మీడియాలో పార్టీ మారుతున్నట్లు చేస్తున్నవి తప్పుడు ప్రచారాలని అన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తా ఆని శపథం చేశారు.

Advertisement

Next Story