- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPLలో కాయ్ రాజా కాయ్.. ప్రతి బాల్‌కో రేటు ఫిక్స్ చేసి జోరుగా బెట్టింగ్
దిశ, నాగార్జునసాగర్ : ప్రతి వేసవి కాలంలో ఐపిఎల్ సీజన్ వచ్చిందంటే చాలు బెట్టింగ్ రాయుళ్లు పండగ చేసుకుంటున్నారు. ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌లపై ప్రజలకు ఉన్న క్రేజీని సొమ్ము చేసుకునేందుకు నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని హాలియా పట్టణ కేంద్రం నందికొండ మున్సిపాలిటీ కేంద్రంలో యువకులు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. తమ మొబైల్ ఫోన్లలో ఐపీఎల్ మ్యాచ్‌లను లైవ్‌లో చూస్తూ అప్పటికప్పుడు తమ స్నేహితులతో కలిసి బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు పట్టణాలకే పరిమితమైన ఈ విష సంస్కృతి చాపకింద నీరులా గ్రామీణ ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తు న్నది. యువత పెద్ద మొత్తంలో అప్పులు చేస్తూ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు.
తల్లిదండ్రులు, పిల్లల వ్యవహారశైలిపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. డబ్బుల కోసం వారు చోరీలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లు బోలెడంత వినోదం ఇస్తున్నాయి. ఆట ఆరంభం నుంచి చివరి వరకు ఉత్కంఠను రేపుతున్న మ్యాచ్‌లను ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇదే సమయంలో బెట్టింగ్ బాబులు జోరుగా పందేలకు తెరలేపుతున్నారు. ఈ సారి కరోనా పరిస్థితులు అంతగా లేకపోవడంతో బెట్టింగ్‌లో నేరుగా డబ్బులు పెట్టడంతో పాటు ఆన్‌లైన్ మార్గాలను చాలా మంది యువత ఎంచుకుంటున్నారు. వివిధ చెల్లింపు వ్యాలెట్ల ద్వారా డబ్బులను మార్చుకుంటూ బెట్టింగ్‌లు కాస్తున్నారు.
కోడ్ భాషతో..
బూకీల వద్ద పందేలు కాసే వారికి కోడ్ భాష వాడుతున్నారు. వారి దగ్గర ఒకసారి రిజిష్టర్ అయిన నంబర్ నుంచి ఫోన్ వస్తేనే మాట్లాడతారు. లెగ్ అనే పదం బెట్టింగ్ రాయుళ్లు వాడే కోడ్ భాష. ఎవరు ఎన్ని లెగ్‌లు తీసుకుంటే అన్నింటికి లెక్కగట్టి మొత్తం చెల్లించాలి. గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న జట్టుపై కాసేందుకు ఫ్లెయింగ్, తక్కువగా ఉన్న జట్టుపై కాసేందుకు ఈటింగ్ అనే పదాలను వాడుతున్నట్లుగా తెలుస్తోంది. మ్యాచ్ జరిగే రోజునే అప్పటికప్పుడు లావాదేవీలు పూర్తవుతాయి. ఐపీఎల్ పోటీలు 20 ఓవర్ల మ్యాచ్ కావడంతో పలు రకాల్లో బెట్టింగ్‌లు పెడుతున్నారు.
చాపకింద నీరులా వ్యాప్తి…
క్రీడారంగంలో ప్రస్తుతం యువత ఎక్కువగా క్రికెట్‌పై మక్కువ చూపుతున్నది. ఆటలంటే అందరికీ అభిమానమే అయినా క్రికెట్ అంటే చిన్న పిల్లవాడు మొదలు పెద్దల వరకు మోజు లేని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఐపీఎల్ పేరిట బెట్టింగ్ జాఢ్యం చాపకింద నీరులా వ్యాపిస్తోంది. బెట్టింగ్‌కు చిన్నా పెద్దా అనే తేడా లేదు. మరీ ముఖ్యంగా యువత బెట్టింగ్‌కు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నది. కొందరు ఈజీ మనీకి అలవాటు పడి సర్వం కోల్పోతున్నారు. క్రికెట్ ప్రేమికుల వ్యసనాన్ని, బలహీనతలను ఆసరాగా చేసుకుని
ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ చివరికి తమను తామే కాపాడుకోలేనంత ఉచ్చులోకి వెళ్లిపోతున్నారు. అప్పులు ఇచ్చిన వ్యక్తులు వేధిస్తున్న క్రమంలో డిప్రెషన్ కు లోనవుతున్నారు. అప్పుల బాధ భరించలేక ఆస్తులు అమ్ముకున్న వారు కొందరుంటే ఆత్మహత్యలకు పాల్పడి జీవితాలను, కుటుంబాలను ఛిద్రం చేసుకుంటున్న వారు లేకపోలేదు. అయితే గుట్టుచప్పుడు కాకుండా ఆన్లైన్ లో సాగిపోతున్న ఈ నయా జూదానికి పోలీసులు సైతం ముకుతాడు వేయలేకపోతున్నారు. ఆస్తులు కోల్పోయి ఆత్మహత్యలు జరిగినప్పుడు మాత్రమే ఇవి వెలుగు చూడటం విచారకరం.
వ్యవహారమంతా ఆన్‌లైన్‌లోనే..
డిజిటల్ సేవలను మంచి పనులకు ఉపయోగించుకోవల్సింది పోయి చెడు మార్గానికి వినియోగించుకునేందుకే యువత మొగ్గు చూపుతోంది. మ్యాచ్‌కు సంబంధించిన ప్రతీ వ్యవహారం అంతా వాట్సప్, హైక్, మెసెంజర్‌ల రూపంలో ఆన్‌లైన్‌లోనే సాగుతోంది. మ్యాచ్ ప్రారంభమైన 20 నిమిషాల ముందే ఆయా జట్ల బలాబలాలపై రేటింగ్స్‌పై కాసేందుకు బుకీలకు సంబంధించిన ఏజెంట్లు యువతకు విషయాన్ని చేరవేస్తున్నారు. దీంతో యువత చిల్లిగవ్వ లేకపోయినా అప్పుగానో, వస్తువులు తాకట్టు పెట్టో డబ్బును బెట్టింగ్‌లో పెడుతున్నారు. పందెంలో గెలిచినా ఓడినా సరే డబ్బు కూడా ఆన్‌లైన్‌లోనే బదిలీ అవుతోంది. ముఖ్యంగా ఆన్‌లైన్ సర్వీస్‌లు అయిన గూగుల్‌పే, పేటీఎం, ఫోన్‌పే యాప్‌ల నుంచి నగదును ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. క్యాష్‌లైస్‌గా ఈ వ్యవహారం జరుగుతుండడంతో ఎక్కడ ఏ చిన్న అనుమానం రాకుండా గుట్టుగా వ్యవహారం కొనసాగుతోంది.
బెట్టింగ్‌లో చిక్కితే భవిష్యత్తు అంధకారమే…
బెట్టింగ్ మాయలో పడితే భవిష్యత్తు అంధకారం అవుతుంది. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు. మా రికార్డుల్లో పేరు, చిరునామా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా, విదేశాలకు వెళ్లాల్సి వస్తే ఇబ్బందులు తప్పవు. బెట్టింగ్ ఆడుతూ లేదా నిర్వహిస్తూ పట్టుపడితే కఠిన చర్యలు తప్పవు. యువత సన్మార్గంలో నడవాలి. ఈజీ మనీకి అలవాటు పడి చెడు మార్గాన్ని ఎంచుకోవద్దు. ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తోంది. ఉద్యోగాలు సాధించేలా చక్కగా చదువుకుని తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా ఉద్యోగాలు సంపాదించాలి. ఇలాంటి వ్యవహారాల్లో తల దూర్చవద్దు.
- బీసన్న, నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్