crime : రూమ్ నుండి బయటకు వెళ్లి చెరువులో శవమై తేలాడు

by Sridhar Babu |
crime : రూమ్ నుండి బయటకు వెళ్లి చెరువులో శవమై తేలాడు
X

దిశ, శేరిలింగంపల్లి : తాను ఉంటున్న రూమ్ నుండి బయటకు వెళ్లి కనబడకుండా పోయిన యువకుడు రెండు రోజుల తర్వాత దుర్గం చెరువులో శవమై తేలాడు. మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్ లోని చందానాయక్ తండాలో తన స్నేహితులతో కలిసి ఉంటున్న విజయనగరానికి చెందిన నంబూరి చాణక్య వర్మ (24) మాదాపూర్ లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. శుక్రవారం తాను ఉంటున్న రూమ్ నుండి బయటకు వెళ్లిన చాణక్యవర్మ రాత్రి అయినా రూమ్ కు తిరిగి రాలేదు. అతని ఫోన్ కూడా స్విచ్చాఫ్

చేసి ఉండడంతో అతని రూమేట్స్ తెలిసిన వారి వద్ద ఆరా తీశారు. అయినా అతని ఆచూకీ లభించిక పోవడంతో మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఆదివారం ఉదయం దుర్గంచెరువు సమీపంలో చాణక్య వర్మ మృతదేహం లభించింది. మృతుడు నంబూరి చాణిక్యవర్మగా గుర్తించిన పోలీసులు అతని స్నేహితులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చాణక్య వర్మ మృతికి ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed