- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బోర్డు తిప్పేసిన 'లక్కీ మాయ లేడీ'.. కోట్లతో ఉడాయించిన వైనం..
దిశ,బెల్లంపల్లి: అక్రమ సంపాదనే ధ్యేయంగా ఓ మాయ లేడి అనుమతిలేని లెక్కిస్కీoను ఎంచుకుంది. ఇల్లీగల్ గా కోట్లు గడించాలనే దురాశతో సదరు మహిళ కోట్ల రూపాయలు సభ్యుల నుంచి వసూలు చేసి ఊడయించిన సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత మహిళలు జరిగిన మోసానికి లబోదిబోమంటూ ఒక్క రోక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి కాల్ టెక్స్ ప్రాంతంలో మూడు సంవత్సరాల క్రితం ఓ మహిళ జై గణేష్ ఎంటర్ప్రైజెస్ లక్కీ స్కీమ్ ను ఏర్పాటు చేశారు. సదరు మహిళ ఏర్పాటు చేసిన ఈ స్కీంలో మహిళలే అత్యధికంగా సభ్యులుగా చేరారు. ఈ స్కీమ్ విధి విధానాల ప్రకారం ప్రతి నెల సభ్యులు రూ.650 కట్టారు. ఇలా 20 నెలలు కట్టాలి. 999 సభ్యులు రూ.650 చొప్పున కట్టారు.
ప్రతినెల లక్కీ డ్రా తీస్తారు. ఈ డ్రాలో విజేతకు ఖరీదైన ఆర్టికల్స్ వస్తువులు ఇస్తామని ఆశ చూపారు. ఈ లెక్కన రూ.6 కోట్ల వరకు స్కీం లో జమయ్యాయి. ఇంతవరకు సభ్యులకు ఖరీదైన వస్తువు ఇచ్చిన దాఖలు లేవు. సభ్యుల నుంచి నెలవారీగా జమ చేసిన పెద్ద మొత్తంలో స్కీం నగదును దిగమింగి తమ సొంతూరు నిర్మల్ జిల్లాకు సదరు స్కీమ్ ఓనర్ వెళ్ళిపోయింది. స్కీం లో చేరిన 999 సభ్యులు నిండా మోసానికి గురయ్యారు. జై గణేష్ ఎంటర్ప్రైజెస్ ఆఫీస్ మాయమైంది. స్కీం నిర్వాహకురాలు ఎక్కడికి వెళ్లిందో కూడా తెలియక సభ్యులు తలలు పట్టుకున్నారు. స్కీం పేరిట తెగ మోసపోయామని గ్రహించారు. చేసేదేమీ లేక జరిగిన మోసాన్ని తలుచుకొని పోలీసులను ఆశ్రయించక తప్పలేదు.
మోసానికి ఏజెంట్లే...
బెల్లంపల్లిలో లక్కీ స్కీం నిర్వాహకురాలు భారీ మోసానికి స్కెచ్ వేసింది. జై గణేష్ ఎంటర్ ప్రైజస్ లక్కీ స్కీమ్ కు ఏజెంట్లనే ఎరగా మలుచుకుంది. స్కీం లో పదిమంది ఏజెంట్లను నియమించుకుంది. ఒక్కో ఏజెంట్ 100 సభ్యులకు తగ్గకుండా చేర్పించడం టార్గెట్ గా పెట్టుకుంది. మాయలేడి వద్ద ఏజెంట్లుగా చేరిన యువకులు అత్యధికంగా సభ్యులను చేర్పించారు. లక్కీ స్కీమ్ లో మొత్తం 999 మంది సభ్యులను చేర్పించారు. ప్రతినెల ఒక్కో సభ్యులు రూ.650 చొప్పున 20 నెలలు పాటు కట్టారు.20 నెలలకు సభ్యులు కట్టిన డబ్బులు మొత్తం రూ.13000 అయ్యాయి. ప్రతి నెల లక్కీ డ్రా తీసి డ్రాలో పేరు వచ్చిన సభ్యులుకి ఆశగా చూపించిన గృహోపకరణ వస్తువుల్లో ఒకటి ఇవ్వడం ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశంగా చెప్పడం మోసానికి పరాకాష్ట.
ఖరీదైన వస్తువులతో నమ్మించారు..
లక్కీ స్కీమ్ లో సభ్యులు చేరేందుకు అత్యంత ఖరీదైన వస్తువులతో ప్రచారం చేశారు. బ్రోచర్లు తయారు చేపించి ఆకర్షణీయమైన ఆర్టికల్స్ ఇవ్వనున్న ప్రచారంతో స్కీమ్ కు భారీ ఆర్థిక స్థాయి ఉన్నట్లు నమ్మించారు. లక్కీ స్కీమ్ లో డ్రా వస్తువులుగా మొబైల్, టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, బైక్, బంగారం, ఇంకా ఎన్నో అత్యంత విలువైన వస్తువులను ఇస్తామని ఏజెంట్ల ద్వారా ప్రచారం చేశారు. ప్రచార వలలో పడి ఇబ్బడి ముబ్బడిగా చేరి సభ్యులు మోసపోయారు. సభ్యులను, ప్రజలను నమ్మించడానికి ఆఫీస్, ఉద్యోగుల నియామకం మోస పోవడానికి ప్రధాన భూమికగా పనిచేశాయి. అంతేకాకుండా ఎంటర్ ప్రైజెస్ లో వస్తువులకు జీఎస్టీ జి కడుతున్నట్లు నకిలీ పత్రాలను సృష్టించి సభ్యులను మరి నమ్మించారు. మోసం చేశారు. లక్కీ స్కీమ్ మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు స్కీమ్ లో చేరిన సభ్యులకు రెండు, మూడు నెలలకు ఒకసారి ఏదైనా ఒక వస్తువు ఇచ్చి నమ్మబలికారు. లక్కీ స్కీం పై ఆశతో స్కీం నిర్వహకురాలి మోసపు గుట్టును గ్రహించలేకపోయారు. సదరు మహిళ ఎలా చెప్తే అలా తలూ పుకుంటూ పోయారు.
బెల్లంపల్లి వాస్తవ్యురాలు అని ఆమెను నమ్మారు. స్కీం ప్రీమియం ప్రకారం ఏ సభ్యులకు తగిన లాభం దక్కలేదు. నెల వారిగా సభ్యుల నుంచి చెల్లింపులు మాత్రం ఆగలేదు. ఏడాది క్రితం బోర్డుతిప్పేసిన మహిళ ఘరానా మోసాన్ని బాదితులు ఎవరికి చెప్పకుండా ఉండిపోయారు. మాయ మాటలు చెప్పి స్కీం లో చేర్పించిన ఏజెంట్ల మెడకు ఉచ్చు బిగుసుకుంది. కట్టిన డబ్బులు, ఇస్తామన్న వస్తువులకు సభ్యులు నోచుకోలేకపోయారు. బెల్లంపల్లి కేంద్రంగా తొలిసారిగా ఓ మహిళ నెలకొల్పిన స్కీo బాగోతం జిల్లాలో చర్చనీయాoశంగా మారింది. కోట్ల రూపాయలను స్కీం పేరట జమచేసి అదృశ్యమైన మహిళ, ఏజెంట్ల పై సభ్యులు నిప్పులు చెరుగుతున్నారు. కోట్ల రూపాయలతో బెల్లంపల్లి నుంచి ఫరారై నిర్మల్ లో తలదాచుకుంటున్న లక్కీ స్కీమ్ నిర్వహకురాలిపై ఇప్పటికే కొందరు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. అదే దారిలో మరికొందరు ఉన్నారు. తమకు జరిగిన మోసాలను పోలీసులకు విన్నవించుకుంటున్నారు.న్యాయం కోసం బాధిత మహిళలు పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. అవసరమైతే కోర్టును ఆశ్రయించి మోసకారి కి తగిన బుద్ధి చెప్తామని బాధిత మహిళల్లో ఆక్రోషం వ్యక్తమవుతున్నది. లక్కీ స్కీం పేరిట కోట్ల రూపాయలు కైంకర్యం చేసిన మహిళ పై చర్య తీసుకొని న్యాయం చేయాలని బాధిత మహిళలు పోలీసులను వేడుకుంటున్నారు.