ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురికి తీవ్ర గాయాలు

by Jakkula Mamatha |
ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురికి తీవ్ర గాయాలు
X

దిశ ప్రతినిధి,అనకాపల్లి: గూడెం కొత్త వీధి మండలం రింతాడ పంచాయతీ ఆసరాడ సమీపంలోని తోటమామిడి గ్రామంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని మెరుగైన చికిత్స కోసం పాడేరు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రింతాడ పంచాయతీ పరిధిలోని ఆసరాడ తోటమామిడి గ్రామ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని మొట్టడం జీవన్, పాంగి ధారబాబు, పాంగి చిరంజీవి, లకే రాశి కుమారి, డొంబోరి అన్నపూర్ణ తీవ్ర గాయాల పాలయ్యారు. చింతపల్లి నుంచి కొయ్యూరు వెళుతున్న ద్విచక్ర వాహనం, పెదవలస నుంచి చింతపల్లి వస్తున్న ద్విచక్ర వాహనాలు రెండూ తోటమామడి గ్రామ సమీపంలో ఢీ కొనడంతో కొయ్యూరు వైపు వెళుతున్న మొట్టడం జీవన్, పాంగి ధారబాబు, చింతపల్లి వస్తున్న పాంగి చిరంజీవి, లకే రాశి కుమారి, డొంబోరి అన్నపూర్ణ లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ మార్గం గుండా ప్రయాణించే ప్రయాణికులు క్షతగ్రతలను హుటాహుటీన చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. చింతపల్లి ఏరియా ఆసుపత్రి వైద్యాధికారులు ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం క్షతగ్రతలను, పాడేరు, నర్సీపట్నం ఏరియా ఆసుపత్రులకు తరలించారు.

Advertisement

Next Story