- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆర్థిక లావాదేవీలే ఆయువు తీశాయి
దిశ, కామారెడ్డి : కామారెడ్డి పట్టణానికి చెందిన వడ్డీ వ్యాపారి విశ్వనాథం హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన బిల్డర్ లక్ష్మీబాయికి వడ్డీ వ్యాపారి విశ్వనాథంకు భూ తగాదాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయంలో గత 15 రోజుల క్రితం ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. అయితే తాను తీసుకున్న డబ్బులను వడ్డీతో సహా చెల్లించినా తన ప్లాట్, ఇండ్లు తిరిగి రిజిస్ట్రేషన్ చేసివ్వకుండా విశ్వనాథం ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఇటీవల లక్ష్మీబాయి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
మంగళవారం ఉదయం విద్యానగర్ ఏరియాలో ఉన్న శివాలయంలో పూజ నిమిత్తం వెళ్లిన విశ్వనాథంపై లక్ష్మీబాయితో పాటు మరికొందరు కర్రలు, మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడి సమయంలో అక్కడున్న స్థానికులు అప్రమత్తమై వారిని అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో దాడికి పాల్పడిన వారు అక్కడినుంచి పారిపోగా విశ్వనాథంను కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్ లోని యదోశా ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. ఈ విషయమై ఈ ఘటనకు బాధ్యులైన వారిపై హత్య కేసు నమోదు చేసి వారికోసం గాలిస్తున్నట్లు కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
- Tags
- murder