నీట మునిగి తండ్రి మృతి.. కూతురిని కాపాడిన మేనమామ

by Sridhar Babu |
నీట మునిగి తండ్రి మృతి.. కూతురిని కాపాడిన మేనమామ
X

దిశ, పాపన్నపేట : నీట మునిగి తండ్రి మృతి చెందగా.. కోడలిని మేన మామ కాపాడిన సంఘటన పాపన్న పేట మండల పరిధిలోని ఏడుపాయల మంజీరా నదిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. కుటుంబీకులు, ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ సమాచారం మేరకు.. మెదక్ పట్టణంలోని అరబ్ వీధికి చెందిన తూర్పు అనిల్ (30) ప్రభుత్వవసతి గృహాలకు కూరగాయలు సమకూర్చుతూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం భార్య కృష్ణవేణి, కుమార్తె హిరణ్య, మేన బావమరిది కట్లె వెంకట్ లతో కలిసి ఏడుపాయలకు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అక్కడే రాత్రి నిద్ర చేసి శుక్రవారం ఉదయం స్నానం ఆచరించడానికి ఘనపూర్ డ్యాం వద్దకు చేరుకున్నారు.

స్నానాలు ఆచరించడానికి కుమార్తె తో కలిసి ఘణపురం ఆయకట్టు పరిధిలోని ఫతేనహర్ కాలువలోకి దిగగా ఇరువురు నీటి ప్రవాహంలో కొట్టుకపోయారు. కుమార్తె కాలువలో కొద్ది దూరంలో ఉన్న చెట్టు పొదలు తగిలి ఉన్న చిన్నారిని గమనించిన మేన మామ వెంకట్ తనకు ఈత రాదని తెలిసి కూడా కోడలిని రక్షించాలన్న తలంపుతో కాలువ పక్కన గల చెట్టు పొదల సహాయంతో రక్షించాడు. మేన బావ అనిల్ కోసం గాలించగా ఎంతకూ ఆచూకీ లభ్యం కాకవడంతో వెంటనే పాపన్న పేట పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఫతెనహర్ కాలువ వెంట వెతకగా నీటిపై మృతదేహం తేలియాడుతూ కనపడంతో బయటకు తీసి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. భార్య కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed