తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం... మక్తల్ వాసి మృతి

by Sridhar Babu |
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం... మక్తల్ వాసి మృతి
X

దిశ, మక్తల్ : తమిళనాడులోని కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్​కి కిలోమీటర్ దూరంలో రోడ్డు ఢీవైడర్ ను కారు ఢీకొని బోల్తా పడటంతో మక్తల్ వాసి మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మక్తల్ కు చెందిన మాజీ మార్కెట్ చైర్మన్ నరసింహ గౌడ్ ఇద్దరు కొడుకులు ఇద్దరు మిత్రులతో నలురురు కలిసి కారులో మూడు రోజుల కిందట తమిళనాడు రాష్ట్రానికి విహారయాత్రకు వెళ్లారు.

ఆదివారం కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ శివాలయాన్ని దర్శించుకుని మిగతా ప్రాంతాలను చూడ్డానికి కోయంబత్తూర్ నుండి నాగపట్నంకి హైవేపై పట్టణంలోకి ప్రవేశించే సమయంలో అదుపు తప్పి డివైడర్ కు కారు ఢీకొని బోల్తా పడింది. దీంతో అమృత గౌడ్ మృతి చెందగా మిగతా ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ విషయం తెలియగానే కుటుంబ సభ్యులు కోయంబత్తూర్ కు బయలుదేరి వెళ్లారు.

Advertisement

Next Story

Most Viewed