డెంగ్యూ జ్వరంతో చిన్నారి మృతి

by Sridhar Babu |
డెంగ్యూ జ్వరంతో చిన్నారి మృతి
X

దిశ, తొర్రూరు : డెంగ్యూ జ్వరంతో చిన్నారి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...గూబ అమల, అశోక్ దంపతుల చిన్న కూతురు హాధ్విక (4 ) గత మూడు రోజుల నుండి జ్వరం రావడంతో హన్మకొండలో గల కిడ్స్ కేర్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కిడ్స్ కేర్ ఆసుపత్రిలో డెంగ్యూ జ్వరం

టెస్ట్ ముందుగా చేయకపోవడంతో పాపకు విపరీతంగా జ్వరం పెరిగి చివరి స్టేజీలో డెంగ్యూ టెస్ట్ చేయడంతో టెస్ట్ పాజిటివ్ రావడంతో వెంటనే పాపను ఎంజీఎం ఆస్పత్రికి తరలించాలని కిడ్స్ కేర్ ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. వెంటనే పాపను ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. సంఘటనా స్థలానికి తొర్రూరు డీఎస్పీ సురేష్ బాబు, సీఐ జగదీష్ చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.

డెంగ్యూ, గుండెలో రంధ్రంతో మరణించింది : జ్యాలిత, మెడికల్ ఆఫీసర్ తొర్రూరు

చిన్నారి డెంగ్యూ జ్వరంతో మరణించింది. అదే విధంగా పాప హెల్త్ రిపోర్టులో గుండెలో రంధ్రం ఉన్నట్టు తేలింది. ఆ రెండు సమస్యలతో మరణించింది.

Advertisement

Next Story

Most Viewed