- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘన్ పూర్ లో యువకుడి దారుణ హత్య
by Sridhar Babu |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఘన్ పూర్ గ్రామ చౌరస్తా కమాన్ వద్ద ఉన్న చికెన్ సెంటర్ లో ఓ యువకుడి మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు నడిపల్లి తండాకు చెందిన కృష్ణ (28) గా గుర్తించారు. రోజువారీ కూలి పని చేసుకుంటూ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. చికెన్ సెంటర్ పక్కనే ఉన్న కల్లుబట్టి వద్ద గొడవ జరిగి ఉండవచ్చని, ఈ క్రమంలోనే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. డిచ్ పల్లి సీఐ మల్లేశ్ సీసీ ఫుటేజ్ ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Advertisement
- Tags
- murder
Next Story