మా అన్నయ్యని చంపింది ఆయనే.. తహశీల్దార్ రమణయ్య సోదరుడి సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |
మా అన్నయ్యని చంపింది ఆయనే.. తహశీల్దార్ రమణయ్య సోదరుడి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో తహశీల్దార్ రమణయ్య హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఇంట్లో దూరి కొందరు దుండగులు ఆయన్ను దారుణంగా రాడ్లతో కొట్టి చంపారు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా కొమ్మాదిలో చోటుచేసుకుంది. తాజాగా.. ఈ హత్యపై రమణయ్య సోదరుడు రాజేంద్ర స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చీపురుపల్లిలో 7 ఎకరాల ల్యాండ్ కోసం కొంతకాలంగా మమ్మల్ని చంపేస్తామని బ్రోకర్ ప్రసాద్ బెదిరిస్తూ వచ్చాడు. నిన్న సైట్ వాచ్‌మెన్ ఫోన్ నుంచి కాల్ చేసి మరోసారి బెదిరించాడు. సాయంత్రం లోపు చంపేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. భయపడి నేను ఇంట్లోనే ఉన్నాను. ఇలా మా సోదరుడ్ని చంపుతాడని ఊహించలేదు.

కాగా, శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఫోన్ రావడంతో రమణయ్య ఇంటి గేటు వద్దకు వచ్చాడు. అక్కడ గేటు వద్ద ఒక వ్యక్తితో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో అనూహ్యంగా ఆ వ్యక్తి రమణయ్య తలపై పెద్ద రాడ్‌తో బలంగా కొట్టాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో పడివున్న రమణయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. ఈ దాడి వ్యవహారమంతా అక్కడి సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Next Story