BREAKING: విశాఖ జిల్లాలో దారుణంలో.. మైనర్‌పై మాస్టర్ అత్యాచారం

by Shiva |
BREAKING: విశాఖ జిల్లాలో దారుణంలో.. మైనర్‌పై మాస్టర్ అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్: గురు, శిష్యుల బంధానికి మాయనిమచ్చను తెచ్చిన ఘటన విశాఖ జిల్లాలో ఇవాళ చోటుచేసుకుంది. పట్టణ పరిధిలోని మధురవాడకు చెందిన మైనర్ బాలిక స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో ఆ బాలికపై అదే పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న దుర్గాప్రసాద్ కళ్లు పడ్డాయి. దీంతో బాలికకు మాయమాటలు చెప్పి అతడు మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని కూడా బెదరించారు. భయభ్రాంతులకు గురైన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో నిందితుడు పీఈటీ దుర్గాప్రసాద్‌పై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అతడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతున్నామని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story