- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వదినెను హతమార్చిన మరిది
దిశ, భిక్కనూరు : తండ్రిని ఆసుపత్రులకు తీసుకెళ్లేందుకు ఖర్చులు బాగా అవుతుండడంతో భూమి అమ్ముదామనగా, వదినె వ్యతిరేకించడంతో కోపంతో ఊగిపోయి మరిది చాకుతో ఆమెను హతమార్చిన ఘటన శుక్రవారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బాగిర్తిపల్లిలో ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన మంద పోచయ్యకు ఇద్దరు కుమారులు రాములు, సురేష్ ఉన్నారు. సుమారు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఆయన పేరున ఉండడంతో గత కొంతకాలంగా భూ తగాదా విషయమై అన్నదమ్ముల మధ్య పంచాయతీ నడుస్తోంది. ఇదంతా ఏం బాధ అంటూ వదినె లావణ్య (36) యేసు మని ) రెండు రోజుల క్రితం 20 వేల రూపాయలు అప్పు తెచ్చి మరిది సురేష్ కు అప్పగించింది.
ఇవాళ ఉదయం తన ఇంటి పక్కన ఉన్న గుడిసెలో బాసన్లు తోముతున్న లావణ్య పై వెనకాల నుంచి వచ్చి చాకుతో మెడ పై దాడి చేయడంతో భయపడి పోయి ఆమె అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఈలోపు అన్న కుమారుడు జస్వంత్ ను సైతం హతమార్చేందుకు ప్రయత్నించాడు. ఈ లోపు అన్న కుమారుడు తప్పించుకొని పారిపోగా అన్న రాములు, చుట్టుపక్కల వారు సురేష్ ను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారిని చేతిలో ఉన్న చాకుతో బెదిరించడంతో పక్కకు తప్పుకున్నారు. తప్పించుకొని కొద్ది దూరం వెళ్లిన వదినెను వెంబడించి చాకుతో పొడిచి హతమార్చాడు. ఈ విషయం గ్రామంలో దావనంలా వ్యాపించడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. వదినెను హతమార్చి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న భిక్కనూరు సీఐ సంపత్ కుమార్, ఎస్ఐ సాయికుమార్ నేతృత్వంలోని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
అత్తమామలపై బంధువులు దాడి చేసే ప్రయత్నం...
తమ కూతురు హత్య కావడానికి అత్తమామలే ప్రధాన కారణమని ఆరోపిస్తూ హతురాలు లావణ్య బంధువులు అత్తమామల పై దాడి చేసే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోతున్న బంధువులను, గ్రామస్తులను సముదాయించి పక్కకు తప్పించగా బంధువులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీయడంతో పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వరరావుతో పాటు కామారెడ్డి రూరల్ సీఐ రామన్, మాచారెడ్డి ఎస్ఐ అనిల్, దోమకొండ ఎస్ఐ ఆంజనేయులు, రామారెడ్డి ఎస్ఐ నరేష్, రాజంపేట ఎస్ఐ పుష్పరాజ్ లతోపాటు స్పెషల్ పార్టీ బలగాలు గ్రామానికి చేరుకున్నాయి. ఈలోపు సురేష్ నివసిస్తున్న ఇంట్లోనే తల్లిదండ్రులను బంధించి తాళాలు వేయించారు. అక్కడికి ఎవరు రాకుండా పోలీసులు రక్షణ కల్పించారు.
భూమిని మృతురాలి కుమారుడిపై చేసే వరకు శవాన్ని తరలించేది లేదని...
మృతురాలి అత్తమామలపై ఉన్న నాలుగు ఎకరాల భూమితో పాటు, ఆస్తులన్నీ ఆమె కుమారుడు జస్వంత్ పేరున చేసే వరకు మృతదేహాన్ని ఇక్కడి నుంచి కదిలించేది లేదని మృతురాలి తల్లి, బంధువులు భీష్మించుకుని కూర్చోవడంతో స్వల్ప ఉద్రిక్తత కు దారితీసింది. గజ్వేల్ సమీపంలోని గ్రామానికి చెందిన మృతురాలి బంధువులు, కుల సంఘం పెద్ద మనుషులతో డీఎస్పీ నాగేశ్వరరావు తోపాటు పోలీస్ సిబ్బంది పలు దఫాలుగా చర్చలు జరిపి, మృతురాలి కుటుంబానికి న్యాయం జరగాలంటే, తమకు పూర్తిగా సహకరించాలని లేకపోతే నష్టపోయేది మీరే అంటూ నచ్చ జె ప్పారు. నాలుగు ఎకరాల భూమి తల్లిదండ్రులు తిరుమలవ్వ, పోచయ్యల పేరున ఉండగా దానిని మనవడు జస్వంత్ పేరున మార్చేందుకు ఒప్పుకోవడంతో బాండ్ పేపర్ రాయించుకున్నారు. దీంతో 9 తొమ్మిది గంటలుగా సాగుతున్న ఉద్రిక్తతకు తెరపడినట్లు అయింది.
- Tags
- murder