- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ALERT : ఇంట్లో ఏసీ వాడుతున్నారా..?
దిశ, కంటోన్మెంట్ / బోయిన్ పల్లి : కార్ఖాన పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి10 గంటల ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బోయిన్‌పల్లి మార్కెట్ రోడ్‌లో ఉన్న జూపిటర్ కాలనీ ఎస్ఎంఆర్ కృష్ణ అపార్ట్‌మెంట్‌లోని 404 మంగ శర్మ ఇంటిలో ఒక్క సారిగా ఏసీలో నుండి మంటలు రావడంతో వెంటనే అది గమనించిన 403 ఫ్లాట్ యజమాని సత్యనారాయణ అరుపులతో అందరు బయటకు వచ్చారు. వెంటనే అప్రమత్తమై ఫైర్ డిపార్ట్‌మెంట్, పోలీసులకు కాల్ చేశారు. ఫైర్ సిబ్బంది గంట తర్వాత రావడంతో అప్పటికే లోపల ఉన్న ఏసీ, ఫర్నిచర్, బట్టలు, వస్తువులు కాలి బూడిద అయ్యాయి. మంటలు ఆగి పోయి దట్టమైన పొగలు అలుముకోవడంతో చుట్టు పక్కన ఉన్న వారంతా కిందికి పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది సకాలంలో వచ్చి ఉంటే ఆస్తి నష్టం జరిగేది కాదని స్థానికులు తెలిపారు. దట్టమైన పొగలు రావడంతో వృద్ధులు అవస్థ పడ్డారని, ప్రాణ నష్టం ఏమి కాలేదని, ఆస్తి నష్టం మాత్రం సుమారు రూ.15 లక్షల నుండి 20 లక్షల వరకు జరిగి ఉండవచ్చని అంచనా వేశారు. స్థానికులు మాత్రం ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించలేరని ఫైర్ అయ్యారు. ఫైర్ డిపార్ట్ మెంట్, పోలీసులు ఇకనైన వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. తాము అప్రమత్తంగా ఉండడంతోనే ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.