road accident : రోడ్డు ప్రమాదం లో యువకుడు మృతి

by Sridhar Babu |
road accident : రోడ్డు ప్రమాదం లో యువకుడు మృతి
X

దిశ, కొడకండ్ల : మండలంలోని రంగాపురం గ్రామ శివారులో ద్విచక్ర వాహనం, ఆర్ టీ సీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందాడు. సీఐ మహేందర్ రెడ్డి కథనం ప్రకారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం బండ్లపల్లి గ్రామానికి చెందిన జనగాం సాయి కిరణ్ (21) , అర్వపల్లి మండలంలోని జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన జయంత్ (21) లు గురువారం రాత్రి స్కూటీ పై తొర్రూరు వైపు వెళ్తుండగా

రంగాపురం క్రాస్ దగ్గర అదుపు తప్పి ఆర్ టీ సీ బస్సును ఢీ కొట్టారు. తీవ్ర గాయాలు కావడంతో ఇరువురిని జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయి కిరణ్ మృతి చెందాడు. జయంత్ కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. సాయి కిరణ్ తండ్రి జనగామ శేఖర్ ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై శ్రవణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story