- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిర్లక్ష్యం ఖరీదు.. నిండు ప్రాణం
దిశ, భద్రాచలం : ఆశ్రమ పాఠశాలల్లో పర్యవేక్షణ లోపం, అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొంది. తమ బిడ్డలు విద్యావంతులు కావాలని గంపెడాశలతో ఆశ్రమ పాఠశాలల్లో చేర్పిస్తే.. వార్డెన్లు, హెచ్ఎంల భాద్యతారాహిత్యం విద్యార్థుల ప్రాణాలను తీస్తుంది. దుమ్ముగూడెం మండలం, కొత్తపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న నలుగురు విద్యార్థులు హాస్టల్ నుండి తప్పించుకుని ఆటోలో తమ ఇండ్లకు వెళ్తుండగా, తునికి చెరువు దగ్గర ఆటోకి ప్రమాదం చోటుచేసుకోవడంతో కుంజా దీపక్ అనే 8 వ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థులు బయటకు వెళ్లకుండా పర్యవేక్షించాల్సిన హెచ్ఎం తప్పించుకుని పోయి గంటలు గడుస్తున్నా గుర్తించకపోవడం వలెనే విద్యార్థి మరణానికి దారితీసింది. గతంలో కూడా ఇటువంటి అనేక సంఘటనలు చోటుచేసుకున్నా... అధికారుల తీరులో మార్పు రావడం లేదు. విద్యార్థుల భవిష్యత్ తీర్చిదిద్దాల్సిన గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఆశ్రమ పాఠశాలలో పర్యవేక్షణ కొరవడిందని పలువురు ఆరోపిస్తున్నారు.