- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Cyber Crime : ఫోన్ కాల్ తెచ్చిన మోసం.. ‘బావా.. తప్పు చేశాను’ అంటూ వివాహిత సూసైడ్
దిశ,వెబ్ డెస్క్ : అప్పు ముప్పు అని ఊరికే అనలేదు పెద్దలు. అప్పు చేయకుండా ఏదైనా చేశాం అంటే ధనికులు గా భావించవచ్చు. కానీ మధ్య తరగతి కుటుంబాలకు అప్పు చేయకుండా కాలం గడపడం కష్టం. అయితే అప్పు,లోన్ కావాలంటే బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. గడుస్తున్న కాలంలో జరుగుతున్న అభివృద్ధి లో భాగంగా ఫోన్ లలోనే యాప్ ల ద్వారా లోన్ పొందవచ్చు.వాటికి ఈ మధ్య ఎక్కువ అలవాటు పడిపోయారు. అయితే ఆ ఫోన్ లోన్ వల్ల ఎంత ఉపయోగం ఉందో అంత హాని కూడా ఉంది. దాన్ని ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.
కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మంటాడ లో ఫోన్ లోన్ వివాహితను బలి తీసుకుంది. పేటేటి స్రవంతి(28)కి ఫోన్ లో రూ.5 లక్షలు రుణం ఇస్తామని ఒక సందేశం వచ్చింది.కుటుంబానికి ఉపయోగపడుతుందని ఆ నంబరును సంప్రదించింది. రూ.5 లక్షలు రుణం ఇచ్చేందుకు తొలుత రూ.20 వేలు, తర్వాత రూ.60 వేలు, వరుసగా రూ.80 వేలు చెల్లించమంటే అప్పు తెచ్చి ఓ లక్ష చెల్లించింది. తర్వాత మరో రూ.1.20 లక్షలు చెల్లిస్తే మొత్తం రుణం ఇచ్చేస్తామంటూ మరో సందేశం రావడంతో తాను ఇక కట్టలేనని నిశ్చయించుకుంది.ఆ విషయన్ని భర్త శ్రీకాంత్ కి చెప్పు కోలేక ఆత్మహత్యకు పాల్పడింది. భర్త ను ఉద్దేశించి సెల్ఫీ వీడియో తీసి అందులో 'బావా తప్పు జరిగిపోయింది. నన్ను క్షమించు. నా ముఖం నీకు ఎలా చూపించగలను? రుణం విషయంలో మోసపోయాను. నాకు భయంగా ఉంది. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా'.అని జరిగిన విషయాన్ని శోకసంద్రంతో వివరించింది.