ఎంఐఎం నేత కాల్పివేత: బిహార్‌లో దారుణ ఘటన

by samatah |
ఎంఐఎం నేత కాల్పివేత: బిహార్‌లో దారుణ ఘటన
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లోని గోపాల్ గంజ్ జిల్లాలో మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం)పార్టీ నేత అబ్దుల్ సలామ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి కాల్చి చంపారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓ కార్యక్రమానికి వెళ్తుండగా నలుగురు వ్యక్తులు అబ్డుల్‌పై కాల్పులకు తెగపడ్డారు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆయనను ఆస్పత్రికి తరలించగా..పరిస్థితి విషమించి మృతి చెందినట్టు గోపాల్‌గంజ్ పోలీసు సూపరింటెండెంట్ స్వర్ణ్ ప్రభాత్ వెల్లడించారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. కాగా, అమీర్ ప్రస్తుతం ఎంఐఎం రాష్ట్ర కార్యదర్శి, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ ఘటనపై ఏంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిందని మండిపడ్డారు. ‘అమీర్‌ను కాల్చివేయడం బాధాకరం. గతంలోనూ మరో నేత ఆరిఫ్ జమాల్ హత్యకు గురయ్యాడు. నితీశ్ కుర్చినీ కాపాడుకోవడం పూర్తైన తర్వాత కొంచెం రాష్ట్ర ప్రజలపై దృష్టి సారించండి. ప్రజల కోసం పనిచేయండి. ఎంఐఎం నేతల కుటుంబాలకు న్యాయంచేయండి’ అని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed