- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లాడ్జిలో యువతితో అడ్డంగా దొరికిన బీఆర్ఎస్ కౌన్సిలర్
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కూతురు వయసున్న అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకుని లాడ్జిలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఓ మున్సిపల్ కౌన్సిలర్ కు స్థానికులు దేహశుద్ధి చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. బోధన్ మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ బెంజర్ గంగారాం కూతురు వయసున్న ఒక అమ్మాయితో బోధన్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో అడ్డంగా దొరికాడు. అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు కౌన్సిలర్ కు దేహ శుద్ధి చేశారు. లాడ్జి నుంచే కొట్టుకుంటూ తీసుకెళ్లి కౌన్సిలర్ గంగారామ్ ను పోలీసులకు అప్పగించారు.
మూడు వారాల క్రితం ఇదే రీతిలో..
బోధన్ మున్సిపాలిటీకి చెందిన మరో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ ఒక అమ్మాయిని లిఫ్ట్ ఇస్తానని చెప్పి కారులో ఎక్కించుకొని మంగళ్ పహాడ్ శివారులో కారులోనే అసభ్యంగా ప్రవర్తించాడు. స్థానికులు గమనించి కౌన్సిలర్ నుండి అమ్మాయిని రక్షించారు. కౌన్సిలర్ కు దేహశుద్ధి చేసి ఎడపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. నెలరోజుల వ్యవధిలోనే బీఆర్ ఎస్ పార్టీకి చెందిన బోధన్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఇద్దరు అమ్మాయిల కేసుల్లో అడ్డంగా బుక్ అవడం జిల్లాలో చర్చనీయాంశమైంది.
- Tags
- BRS councilor