వివాహిత ప్రైవేట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రియుడు!!

by Anjali |
వివాహిత ప్రైవేట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రియుడు!!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా పలువురు జనాలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. ఈ అక్రమ సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నా.. కొందరు మారడం లేదు. పైగా ఈ మధ్యకాలంలో పెళ్లైన మహిళలు యువకులతో ఎఫైర్స్ నడిపిస్తూ.. వారి సంసారాన్ని వారే నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ ఓ యువకుడితో సంబంధం పెట్టుకుని ప్రాణం తీసుకుంది. ఈ విషయం భర్త దృష్టికి రావడంతో ప్రియుడ్ని దూరం పెట్టింది. దీంతో ఆ యువకుడు వివాహితతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో అవమానం తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు.. విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. దీంతో కోపం పెంచుకున్న యువకుడు ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడని.. సమాజంలో పరువు పోతుందని భావించిన మహిళ ఆత్మహత్య చేసుకుందని వెల్లడించారు. ఈ ఘటన త్రిపురలోని దుర్జోయ్‌నగర్‌లో చోటుచేసుకుంది.

Advertisement

Next Story