కేంద్ర ప్రభుత్వ స్కీంను ఉపయోగించుకోని లవర్లతో పారిపోయిన 11 మంది భార్యలు

by Bhoopathi Nagaiah |
కేంద్ర ప్రభుత్వ స్కీంను ఉపయోగించుకోని లవర్లతో పారిపోయిన 11 మంది భార్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : పేద ప్రజల ప్రయోజనాల కోసం, వారికి లబ్ధి చేకూరేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఉచితాలనూ అందిస్తున్నాయి. పేదోడికి కూడు, గూడు, విద్యావైద్యం అంటూ ప్రతి ప్రభుత్వం ఏటా లక్షల కోట్లను ఖర్చు చేస్తోంది. అయితే ఈ పథకాలను కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని కొందరు పెళ్లైన యువతులు పక్కదారి పట్టించారు. ఆ స్కీంలో వచ్చిన డబ్బులు తీసుకోని తమ లవర్లతో పారిపోయారు. ఉత్తర ప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద అర్హులైన పేదవారి ఇళ్లు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.2.5 లక్షలు సబ్సిడీ ఇస్తుంది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మహారాజ్‌గంజ్ జిల్లా నిచ్‌లాల్ బ్లాక్‌లోని తొమ్మిది గ్రామాలైన తుతిహరి, శీతలాపూర్, చాటియా, రాంనాదర్, బకుల్దిహ, ఖేషర కిషూన్‌పూర్, మేధౌలి గ్రామాల్లో ఈ పథకం కింద 2350 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారికి మొదటి విడతగా రూ.40 వేల చొప్పున నిధులు రిలీజ్ చేసిన అధికారుల లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా లబ్ధిదారుల్లో కొంతమంది కొత్తగా పెళ్లైన యువతులు ప్రేమ మత్తులో మునిగిపోయి లవర్స్‌తో జంప్ అయ్యారు. ఆయా గ్రామాలకు చెందిన 11 మంది వివాహిత యువతుల ఖాతాలో జమ అయిన డబ్బులను తీసుకోని భర్తలను వదిలేసి తమ ప్రియుళ్లతో ఊరు వదిలి పారిపోయారు. వెంటనే బాధిత భర్తలు బ్లాక్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భార్యలను కోల్పోయిన భర్తలు తమకు న్యాయం చేయాలని ఇటు పోలీస్ స్టేషన్, అటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారు. ఆ 11 మంది వివాహితల ఖాతాలను నిలిపివేయడంతోపాటు రెండో విడత డబ్బులను సైతం అధికారులు ఆపేశారు. ప్రస్తుతం ఈ వార్త మహారాజ్‌గంజ్ జిల్లాలో సంచలనంగా మారింది.

అయితే ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు.. గతంలో బారాబంకి జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఈ పథకం కింద రిలీజ్ అయిన డబ్బులను ఇంటి నిర్మాణానికి కాకుండా మరో దానికి ఉపయోగిస్తే లబ్ధిదారుల నుంచి ఆ డబ్బును రికవరీ చేస్తారు. తాజాగా పారిపోయిన మహిళల ఆచూకీ లభిస్తే వారి నుంచి కూడా ఈ నగదును అధికారులు రికవరీ చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed