Bigg Boss Telugu 8: ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా.. కానీ చనిపోయిన మా నాన్న కాపాడాడు.. ఎమోషనల్ అయిన హీరో

by Prasanna |
Bigg Boss Telugu 8: ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా.. కానీ చనిపోయిన మా నాన్న కాపాడాడు..  ఎమోషనల్ అయిన హీరో
X

దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా కొనసాగుతుంది. కానీ, ఈ సారి హౌస్ మేట్స్ ఎంపిక సరిగా లేదని ఎన్నో విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ సారి సోలో ఎంట్రీ లేదని 7 గురు అమ్మాయిలు, 7 అబ్బాయిలు 14 మందిని జంటలుగా బిగ్ బాస్ ఇంట్లోకి పంపించారు. ఇక ఆ తర్వాత సీన్ తెలిసిందే కదా.. వారి మధ్య గొడవలు పెట్టి నామినేషన్స్ రోజు ఒకరికొకరు తిట్టుకుంటూనే ఉంటారు.. బిగ్ బాస్ రూల్స్ అంటారు.. కానీ, ఒక్కరు కూడా పాటించరంటూ నెటిజెన్స్ ఈ షో మీద మండిపడుతున్నారు. ఇక నిన్న రాత్రి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ కి సంబంధించిన కొన్ని బహుమతులు ఇచ్చి వాళ్ళని ఎమోషనల్ అయ్యేలా చేసాడు.

లాహిరి లాహిరి లాహిరిలో మూవీ హీరో ఆదిత్య ఓం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధనలక్ష్మి ఐ లవ్ యు, ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి, మా అన్నయ్య బంగారం.. వంటి మూవీస్ తో అలరించిన ఈ హీరో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ రావడంతో సినీ ఇండస్ట్రీకి దూరమై మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ రీ ఎంట్రీలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లోకి వెళ్ళాడు.

తాజాగా బిగ్ బాస్ లో లేటెస్ట్ ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ కోసం వారికీ సంబందించిన కొన్ని వస్తువులను ఇంట్లోకి పంపించి వారిని సర్ప్రైజ్ చేసాడు. అవి చూసి బిగ్ బాస్ ఇంటి సభ్యులు చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక ఇతని కోసం వాళ్ళ నాన్న ఫోటో తీసుకొచ్చాడు బిగ్ బాస్. ఇది చూడగానే ఒక్కసారిగా షాక్ అయి అతను ఎమోషనల్ అయి.. " నాకు ఉన్న చెడు అలవాట్లు అవి నేనే నేర్చుకున్నాను. కానీ నాలో ఉన్న మంచి అలవాట్లకు కారణం మా నాన్నే. కరోనా సమయంలో మా ఇంట్లో అందరికీ కోవిడ్ ఎటాక్ అయింది. అప్పుడు ఏం చేయాలో అర్ధం కాలేదు.. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయి అప్పుడు గోడకి తగిలించి ఉన్న మా నాన్న ఫోటో సడెన్ గా కింద పడింది.. డాడీ అలా చేసుకోవద్దని నన్ను హెచ్చరించాడంటూ " ఏడ్చుకుంటూ చెప్పాడు.

Advertisement

Next Story

Most Viewed