- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తండ్రి మెకానిక్.. కంటతడి పెట్టిస్తోన్న అమర్‌దీప్ తల్లి ఎమోషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్ సీజన్-7లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న బుల్లితెర స్టార్ సీరియల్ నటుడు అమర్ దీప్‌కు ప్రేక్షకుల్లో ఎంతగా క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో బాగా రాణించినప్పటికీ పోను పోను గేమ్ అంచనాలకు తగ్గట్లు ఆడటం లేదు. రోజులు గడుస్తున్న కొద్ది అతడి గ్రాఫ్ పడిపోతుంది. ఇక పల్లవి ప్రశాంత్‌ను టార్గెట్ చేసి హైలెట్ కావాలని అమర్ ప్రయత్నించిన విషయం తెలిసిందే. కానీ ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది. ఇక నాగార్జున కూడా అమర్‌దీప్ ఆటపై పెదవి విరిచాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ నటుడిపై విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈయన తల్లి హర్ట్ అయ్యి.. ఓ ఎమోషనల్ వీడియో నెట్టింట షేర్ చేశారు.
‘‘అమర్‌దీప్‌ను చాలా బ్యాడ్ చేసి మాట్లాడుతున్నారు. ఫ్లీజ్ ఇక ఆపండి. నా కుమారుడు చాలా మంచి నటుడు, డాన్సర్, ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడంటే కేవలం అతడు సొంతంగా కష్టపడ్డ ఫలితమే. రైతు గురించి ఎవరూ తప్పుగా మాట్లడరు. నేను కూడా ఒక రైతు బిడ్డనే. అమర్‌దీప్ తండ్రి ఒక మెకానిక్. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. ఎవరూ పెద్ద స్థాయి నుంచి రారు. అమర్‌కరు పొగరు ఉంటుందంటున్నారు. అది వాస్తవం కాదు. తాను చాలా మంచివాడు. దయచేసి సపోర్ట్ చేయండి’’ అంటూ అమర్‌దీప్ తల్లి ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది.