Bigg Boss-8: హౌస్‌లోకి ఆ ఇద్దరు మాజీ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. షాక్‌లో నెటిజన్లు

by Hamsa |
Bigg Boss-8: హౌస్‌లోకి ఆ ఇద్దరు మాజీ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. షాక్‌లో నెటిజన్లు
X

దిశ, సినిమా: తెలుగు రియాలిటీ షో సీజన్-8 ప్రతి వారం ఎంతో రసవత్తరంగా మారుతూ.. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్ మెంట్ అంటూ మొదలైన ఈ సీజన్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఇందులో 14 మంది కంటెస్టెంట్స్ ఇది వరకు లాగా కాకుండా ఈ సారి జంటలుగా హౌస్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందులోంచి ఐదుగురు ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశారు. అయితే ఈ సీజన్‌లో మరింత జోష్ పెంచేందుకు రిలోడ్ పేరుతో పాత కంటెస్టెంట్స్‌ను వైల్డ్ కార్డు ద్వారా పంపిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా, ఆదివారం ఎపిసోడ్ అందరినీ షాక్‌కు గురి చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే.. ఇందులో ఇంతకు ముందు సీజన్లలో పాల్గొన్న మాజీ కంటెస్టెంట్స్ హరితేజ, టేస్టీ తేజ హౌస్‌లోకి వెళ్లారు. ఇక అది చూసిన ప్రేక్షకుల్లో ఈ షో ఎలా మారబోతుందో? అసలు ఈ సీజన్‌లో ముందు ముందు వచ్చే ట్విస్ట్‌లెంటో తెలుసుకోవాలనే ఆతృత పెరిగిపోయింది. అలాగే కొత్త వారితో పాటు పాత కంటెస్టెంట్స్ టాస్క్‌ల్లో ఎలా పాల్గొంటారో? అసలు బిగ్‌బాస్ ఈ సారి ఏం చేయాలనుకుంటున్నాడో అర్థం కాక ప్రేక్షకులు తలలు పట్టుకుంటున్నారు. అయితే ఈ సీజన్‌లో వీరితో పాటు పలువురు వైల్డ్ కార్డ్ ద్వారా మళ్లీ బిగ్‌బాస్ షోలో పాల్గొనబోతున్నట్లు సమాచారం.

Advertisement

Next Story