Bigg Boss -8: హౌస్‌లో సీక్రెట్ ఎఫైర్స్ బయటపెట్టిన సోనియా.. ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే?

by Anjali |
Bigg Boss -8: హౌస్‌లో సీక్రెట్ ఎఫైర్స్ బయటపెట్టిన సోనియా.. ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 విజయవంతంగా ఐదు వారాలు పూర్తి చేసుకుంది. 5 వారాల్లో మొత్తం ఆరుగురు (బేజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, ఆకుల సోనియా, నైనిక, ఆదిత్య ఓం) ఎలిమినేట్ అయ్యారు. అయితే గత వారం ఎలిమినేట్ అయిన సోనియా తాజాగా హౌస్‌లోని సీక్రెట్స్ బయటపెట్టింది. ఓ ఇంటర్వ్యులో పాల్గొన్న సోనియా.. ‘హౌస్ లో కిచెన్ పని అంత తానే చూసుకున్నానని వెల్లడించింది. హౌస్ మొత్తాన్ని కంట్రోల్ చేశానని, రేషన్ కంట్రోల్ చేశానని, అన్ని టాస్కుల్లో ముందున్నానని.. కానీ నన్ను తప్పుగా చూపించారని ఆవేదన వ్యక్తం చేసింది. నిఖిల్, పృథ్వీలతో ఉన్నది చూపించారు ఓకే.. కానీ అదైనా మొత్తం చూపించకుండా కట్ చేసి చూపించడం ఏంటని ఫైర్ అయ్యింది.

అక్కడ జరిగింది వేరు చూపించింది వేరని తెలిపింది. హగ్ చేసుకుంది, చేతులు వేయడాన్ని చూపించారని పేర్కొంది. అంతా కట్ చేసి ఒక బరితెగించిన అమ్మాయిలా ప్రేక్షకులకు చూపించడం అస్సలు కరెక్ట్ కాదని మండిపడింది. టాస్కులో గెలిచినందుకు ఆ సంతోషాన్ని నాతో పంచుకుని హగ్ చేసుకుని కిస్ చేశారని.. దాన్ని ఓ రేంజ్‌లో జూమ్ చేస్తూ హైలెట్ చేశారని తెలిపింది. షోను ముందుకు తీసుకెళ్లడం కోసం ఇంత దారుణంగా చూపిస్తారా? అని విరుచుకుపడింది. అందరికీ ఎఫైర్స్ ఉన్నాయి.. ఇప్పటి నుంచి బయటకు వస్తాయంటూ’ సోనియా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రస్తుతం సోనియా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story