- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిష్కింద నుంచి రామయ్య సన్నిధికి చేరుకున్న రథం..
దిశ, ఫీచర్స్ : అయోధ్యలో శ్రీరాముని విగ్రహం ప్రతిష్ఠాపన ఈనెల 22న జరగనున్న విషయం తెలిసిందే. ఈమేరకు ఇప్పటికే అయోధ్యకు దేశవిదేశాల నుంచి, పలు రాష్ట్రాల నుంచి ఎన్నో బహుమతులు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే హనుమాన్ జన్మస్థలం అయిన కిష్కింధ నుంచి ఓ ప్రత్యేక రథం అయోధ్యకు చేరుకుంది. కర్ణాటక హంపి ప్రాంతంలోని కిష్కింధ నుంచి బయలుదేరిన రథం దేశవ్యాప్తంగా ఉన్న పలు ఆలయాలతో పాటు సీతాదేవి జన్మస్థలమైన నేపాల్‌లోని జనక్‌పూర్ ను సందర్శించి శనివారం అయోధ్య చేరుకుంది. రథంతో పాటు 100 మంది రామభక్తులు శ్రీరాముడి చిత్రాలు ఉన్న కాషాయ జెండాలు పట్టుకుని “జై శ్రీ రామ్” అంటూ నినాదాలు చేస్తూ, ఆడుతూ పాడుతూ ప్రయాణం చేశారు.
“రాముడికి సేవ చేయడానికి తాము కిష్కింధ నుంచి అయోధ్యకు చేరుకున్నామని శ్రీ హనుమాన్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిథి అభిషేక్ కృష్ణశాస్త్రి తెలిపారు. కిష్కింద నుంచి వచ్చిన ప్రత్యేక రథంలో రామచంద్రుడు హనుమాన్ కౌగిలించుకుని ఉన్న విగ్రహం ఉందని తెలిపారు. అయోధ్యలోని భక్తులు, పర్యాటకులను ఆకర్షించే విధంగా ఈ రథాన్ని సరయు నది ఒడ్డున నిలిపారు.