అయోధ్యలో కళ్లు కదిపిన రాంలల్లా విగ్రహం.. వీడియో వైరల్

by Sumithra |
అయోధ్యలో కళ్లు కదిపిన రాంలల్లా విగ్రహం.. వీడియో వైరల్
X

దిశ, ఫీచర్స్ : అయోధ్య రాముని దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. రాముని దర్శనం కోసం తహతహలాడూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఏఐ అద్భతాన్ని సృష్టించింది. సాక్షాత్తు బాల రాముడు భక్తులను చూస్తున్నట్టుగా ఓ వీడియోని షేర్ చేశారు. ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో రాంలల్లా విగ్రహం కళ్లు మెల్లగా తెరిచి చూడడాన్ని వీక్షించవచ్చు. కొంతమంది ఇది AI సృష్టించిన అద్భుత సృష్టిని ఆదమరిచి చూస్తున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనుషులు లేదా జంతువుల మేధస్సుకు భిన్నంగా ఉండే సాఫ్ట్‌వేర్ మేధస్సు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం టెక్‌లోనే హాటెస్ట్ బజ్‌వర్డ్‌లలో ఒకటి. 1956లో రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదం పెరిగిన డేటా వాల్యూమ్‌లు, అధునాతన అల్గారిథమ్‌లు, కంప్యూటింగ్ పవర్, స్టోరేజ్‌లో మెరుగుదలల కారణంగా నేడు మరింత ప్రజాదరణ పొందింది.

Advertisement

Next Story