అయోధ్యకు వెళ్లే టూరిస్టులకు గుడ్ న్యూస్

by samatah |
అయోధ్యకు వెళ్లే టూరిస్టులకు గుడ్ న్యూస్
X

దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్యలోని రామమందిరంలో విగ్రహ ప్రాణప్రతిష్ట వేళ ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆధిత్యనాథ్ ఆదివారం అయోధ్యలో 100 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. అయోధ్య నగరంలో పర్యాటకులకు ఇవి ఎంతో ఉపయోగపడనున్నాయి. ఈ బస్సులు రేపటి నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. సీఎం యోగీ చొరవతో ఈ బస్సులు నగరానికి వచ్చినట్టు అధికారులు తెలిపారు. జనవరి 22న అయోధ్యకు వచ్చే ప్రతినిధులందరికీ ఈ బస్సు సేవలు అందిస్తామని చెప్పారు. వీటిని నడపడానికి డ్రైవర్లకు సైతం ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్టు వెల్లడించారు. కాగా, ఎలక్ట్రిక్ బస్సులు కాలుష్యాన్ని విడుదల చేయవు. అయోధ్య ఈవెంట్ సందర్భంగా సందర్శకులను ఆకర్షించేందుకు వీటిని ప్రత్యేకంగా అలంకరించారు.

Advertisement

Next Story

Most Viewed