అమెజాన్‌లో నకిలీ అయోధ్య ప్రసాదం

by GSrikanth |
అమెజాన్‌లో నకిలీ అయోధ్య ప్రసాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో: అయోధ్య పేరుతో నకిలీ ప్రసాదాలు విక్రియిస్తున్న ఆరోపణలపై ప్రముఖ కామర్స్ దిగ్గజం అమెజాన్ కు కేంద్రం నోటీసులు ఇచ్చింది. రామ ప్రసాదం పేరుతో కస్టమర్లకు నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తోందని ఆరోపిస్తూ కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వారంలోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చింది. లేకుంటే వినియోగదారుల రక్షణ చట్టం-2019 ప్రకారం సంస్థపై చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఈ వ్యవహారంపై స్పందించిన అమెజాన్ కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తున్న విక్రేతలపై చర్యలు తీసుకుంటున్నామని అలాగే రామమందిర ప్రసాదం పేరుతో ఉన్న ఉత్పత్తుల విక్రయాల ఆప్షన్ ను తొలగించినట్లు వెల్లడించారు. కాగా శ్రీరామ మందిర్ అయోధ్య ప్రసాద్, రఘుపతి నెయ్యి లడ్డూ, ఖోయా ఖోబీ లడ్డూ, అయోధ్య రామ మందిర్ అయోధ్య ప్రసాద్, దేవీ ఆవు పాలు.. ఇలా రామ ప్రసాదం పేరుతో నకిలీ ఉత్పత్తులను అమ్ముతున్నట్లు సీఏఐటీ తన ఫిర్యాదులో ఆరోపించింది.

Advertisement

Next Story